తాటి చెట్లు నరికించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి: గీత పనివారల సంఘం

మహబూబాబాద్, జూలై 20(చైతన్యగళం): తాళ్ల సంకీస గ్రామంలో గీత వృత్తిపై ఆధారపడిన తాటి చెట్లను అక్రమంగా నరికించిన కొండపల్లి శ్రీదేవిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, గీత కార్మికులకు న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర గీత పనివారల సంఘం మహబూబాబాద్ జిల్లా సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గీత కార్మికులు నిరసన చేపట్టి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దొంతు రామ్మూర్తి గౌడ్, జిల్లా కోశాధికారి నక్క...