సమగ్ర ఓటర్ సవరణ సర్ ప్రక్రియ విజయవంతం చేయాలి – పీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి

కరీంనగర్, జూలై 20 (చైతన్యగళం): కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న సమగ్ర ఓటర్ సవరణ (SIR) ప్రక్రియపై సోమవారం డీసీసీ కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పీసీసీ ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఆగస్ట్ 3 లోపు సర్ ప్రక్రియను పూర్తి చేసిన కార్యకర్తలకు రాహుల్ గాంధీతో ఫోటో అవకాశం కల్పిస్తాం. ప్రతి అర్హత కలిగిన ఓటు జాబితాలో ఉండేలా కాంగ్రెస్ పార్టీ సైనికులు కృషి చేయాలి. జూలై...