కరీంనగర్, జూలై 20 (చైతన్యగళం):
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న సమగ్ర ఓటర్ సవరణ (SIR) ప్రక్రియపై సోమవారం డీసీసీ కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పీసీసీ ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఆగస్ట్ 3 లోపు సర్ ప్రక్రియను పూర్తి చేసిన కార్యకర్తలకు రాహుల్ గాంధీతో ఫోటో అవకాశం కల్పిస్తాం. ప్రతి అర్హత కలిగిన ఓటు జాబితాలో ఉండేలా కాంగ్రెస్ పార్టీ సైనికులు కృషి చేయాలి. జూలై 31 నాటికి 90% సర్ ప్రక్రియ పూర్తి కావాలి” అని సూచించారు.

కార్పొరేషన్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ, “బి.ఎల్.ఓలు సమన్వయంతో ప్రతి ఓటరికి అవగాహన కల్పించాలి. బి.ఎల్.ఎ-2లు ఇంటింటికీ వెళ్లి ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా చూడాలి. బూత్ స్థాయిలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి ఎన్యుమరేషన్ ఫారాలు నింపడంలో సహాయం చేయాలి” అని అన్నారు.
ఈ సమావేశంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సర్ రిటర్నింగ్ ఆఫీసర్ మడుపు మోహన్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య, కార్పొరేటర్లు గంట కళ్యాణి శ్రీనివాస్, మల్లికార్జున, రాజేందర్, జగన్ రెడ్డి, పడాల అజయ్ కుమార్, ఆకుల నందిని ఉదయ్, కళ్ళపల్లి బాలరాజు, గుమ్మడి రాజకుమార్, ఇక్రమ్ సికిందర్, నగర మైనార్టీ సెల్ అధ్యక్షుడు అహ్మద్ అలీ, ప్రధాన కార్యదర్శి కంకణాల అనిల్ కుమార్, డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, సర్ సూపర్వైజర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.