తోపుడు బండిపై వినూత్న ప్రచారం

ఓటరు నమోదుకు ప్రజలను చైతన్యపరిచిన సీపీఐ కౌన్సిలర్ బి. అజయ్ సారధి రెడ్డి మహబూబాబాద్, జూలై 20 ‌(చైతన్యగళం): ఓటరు నమోదులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిస్తూ మహబూబాబాద్ మున్సిపాలిటీ 33వ వార్డు కౌన్సిలర్, సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి. అజయ్ సారధి రెడ్డి సోమవారం పట్టణంలో వినూత్న ప్రచారం నిర్వహించారు. తోపుడు బండిపై ఓటరు నమోదు దరఖాస్తు ఫారాలను ఉంచి, మైక్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇంటింటికీ వెళ్లి ఓటు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. “ఆగస్టు 3వ...