పీఆర్సీ అమలు చేయకపోతే ఉద్యమం తప్పదు – ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి
హుజురాబాద్, జూలై 19 (చైతన్య గళం): రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ చేపడతామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి హెచ్చరించారు. హుజురాబాద్‌లోని మధువని గార్డెన్స్‌లో పీఆర్టీయూ టీఎస్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో 2026 సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం, జిల్లా కార్యనిర్వాహక సమావేశం జిల్లా అధ్యక్షుడు ఐలేని కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ...