మొగిలి నాయక్‌కు ఘన సన్మానం
హుస్నాబాద్, జూలై 20 (చైతన్యగళం): హుస్నాబాద్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ ఇటీవల ఏఎస్సైగా పదోన్నతి పొందిన మొగిలి నాయక్ మద్దూరు మండలం పోలీస్ స్టేషన్‌లో అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అక్కన్నపేట మండలం పెద్ద తండాలోని ఆయన నివాసంలో గిరిజన సంఘాల నాయకులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. “గిరిజన తండా నుంచి కష్టపడి పోలీసు శాఖలో ఉన్నత స్థాయికి ఎదిగి ఏఎస్సైగా బాధ్యతలు చేపట్టడం గర్వకారణం” అని నాయకులు పేర్కొన్నారు. మొగిలి నాయక్ మరింత ఉన్నత...