పేదల చికిత్సకు ఎల్వోసి అందజేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్
నిజామాబాద్, జూలై 18 (చైతన్యగళం): నియోజకవర్గంలోని అవసరమైన వారికి నిమ్స్‌లో చికిత్స పొందేందుకు ఎల్వోసి అందజేస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ తెలిపారు. శనివారం నగరంలోని కార్యాలయంలో ఎల్వోసి అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “నియోజకవర్గంలో అర్హులైన పేదలకు ఎల్వోసి ఇప్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాను. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్నాను” అని పేర్కొన్నారు. గాజులపేటకు చెందిన తోక శ్రావణ్ కుమార్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా, నిమ్స్‌లో చికిత్స కోసం రూ.5 లక్షల ఎల్వోసి...