కరీంనగర్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్, జూలై 18 (చైతన్యగళం): కరీంనగర్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో రూ.1.18 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ కలిసి శుక్రవారం భూమిపూజలు, శంకుస్థాపనలు నిర్వహించారు. 38వ డివిజన్ పరిధిలోని పద్మశాలి సంఘం వెళ్లే దారిలో రూ.70 లక్షల యూడీఎఫ్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ జరగగా, 3వ డివిజన్ పరిధిలోని విద్యారణ్యపురి...