విద్యార్థుల్లో చట్టాలపై అవగాహన పెంపే లక్ష్యం
మహబూబాబాద్‌లో స్టూడెంట్ లీగల్ లిటరసీ క్లబ్‌ల ప్రారంభం మహబూబాబాద్, జూలై 18(చైతన్యగళం): విద్యార్థి దశ నుంచే షెడ్యూల్ తెగలకు చెందిన బాలబాలికల్లో చట్టాలపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం రెండు స్టూడెంట్ లీగల్ లిటరసీ క్లబ్‌లను ప్రారంభించారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ రూపొందించిన "సంవాద్" పథకం మార్గదర్శకాల మేరకు బయ్యారం ఏకలవ్య గురుకుల పాఠశాల, మహబూబాబాద్ గిరిజన బాలికల పాఠశాలలో ఈ క్లబ్‌లను ఏర్పాటు చేశారు. 9వ, 11వ తరగతులు చదువుతున్న మొత్తం 40 మంది...