ఎల్ నినో ప్రభావంపై అప్రమత్తం-ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలి

సమీక్ష సమావేశంలో ఇంచార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సిద్దిపేట, జూలై 18 (చైతన్యగళం): వానాకాలం–2026లో ఎల్ నినో ప్రభావం కారణంగా భవిష్యత్తులో భూగర్భ జలాలు తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. శనివారం సిద్దిపేట ఐడీఓసీ సమావేశ మందిరంలో వ్యవసాయ అనుబంధ శాఖలు, ప్రత్యేక అధికారులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో...