ఆటోవాలాగా మారిన బండి సంజయ్
కరీంనగర్, జూలై 18 (చైతన్యగళం): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శుక్రవారం సాయంత్రం ఆటోవాలాగా మారి కరీంనగర్ వీధుల్లో స్వయంగా ఆటో నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన నివాసం నుండి బయలుదేరిన ఆయన, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, హిందుత్వ నినాదాలను ప్రచారం చేస్తున్న ఆటో డ్రైవర్ భరత్తో కలిసి దాదాపు ఐదు కిలోమీటర్ల మేర ఆటో నడిపారు. జ్యోతినగర్, మంకమ్మతోట, గీతాభవన్ చౌరస్తా, ప్రతిమ చౌరస్తా, బస్టాండ్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్, బోయవాడ...