CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 10:13 pm Posted by : CHAITHANYA GALAM NEWS

కరీంనగర్‌లో రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత

కరీంనగర్, జూలై 18 (చైతన్యగళం):
రేపు ఉదయం 9:00 గంటల నుండి 11:00 గంటల వరకు 11 కేవీ ఎల్లమ్మ ఫీడర్ ప్రభావిత ప్రాంతాల్లో లైన్ నిర్వహణ పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా టౌన్–1 ఏడీఈ పి. శ్రీనివాస్ మాట్లాడుతూ, “ఆటో నగర్ బైపాస్ రోడ్, కోతిరాంపూర్ ఎన్టీఆర్ చౌరస్తా కొంత భాగం, నా గ్రామం రెస్టారెంట్ ప్రాంతం, గ్యాస్ గోడౌన్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. వినియోగదారులు సహకరించాలి” అని కోరారు.