CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 9:41 pm Posted by : rakeshkashaveni12@gmail.com

ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి: సీఎస్

కరీంనగర్, జూలై 18 (చైతన్యగళం):

సూపర్ ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్న నేపథ్యంలో అన్ని శాఖలు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

శనివారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ, రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలని, తక్కువ నీటి అవసరమయ్యే పంటలను ప్రోత్సహించాలని సూచించారు. ప్రతి జిల్లా శాఖల వారీగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని, తాగునీరు, వ్యవసాయం, విద్యుత్, వైద్యం తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.