CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 9:51 pm Posted by : CHAITHANYA GALAM NEWS

నియోజకవర్గ ఎస్ఐఆర్ ఇంచార్జీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

రామగుండం, జూలై 18 (చైతన్య గళం):
రామగుండం నియోజకవర్గ శాసనసభ్యుడు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి నియోజకవర్గ ఇంచార్జీలతో సర్ (Special Summary Revision) అంశంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “ఆగస్టు 3వ తేదీ వరకు మాత్రమే గడువు ఉన్నందున సర్ ప్రక్రియను అత్యంత వేగవంతంగా పూర్తి చేయాలి. ప్రతి ఇంటిని సందర్శించి ప్రతి ఓటరును వ్యక్తిగతంగా సంప్రదించి, అర్హులైన ప్రతి ఓటరు వివరాలు నమోదు అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి” అని సూచించారు.అలాగే ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఫారాలను పరిశీలించి పూర్తి చేయాలని, బూత్ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రతిరోజూ పురోగతిని సమీక్షిస్తూ నిర్ణీత గడువులోపు సర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఇంచార్జీలకు ఆదేశించారు.