ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీస్ విస్తరణపై న్యాయ విద్యార్థి చెలిమెల మణివర్ధన్ అభ్యంతరం
మనోహరాబాద్, జూలై 18 (చైతన్యగళం): మెదక్ జిల్లా చెట్లగౌరారం, రంగాయిపల్లి గ్రామాల పరిసరాల్లో ఉన్న ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఉత్పత్తి సామర్థ్యాన్ని 10.70 లక్షల టన్నులకు (TPA) విస్తరించేందుకు చేసిన దరఖాస్తును తిరస్కరించాలని న్యాయ విద్యార్థి చెలిమెల మణివర్ధన్ శనివారం సంగారెడ్డి ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలికి లిఖితపూర్వక అభ్యంతర పత్రం సమర్పించారు. 2019లో సంస్థ 6 లక్షల టన్నుల విస్తరణ కోసం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో స్థానికులు గాలి, నీరు, శబ్ద కాలుష్యం, ప్రజారోగ్యం, వ్యవసాయంపై ప్రతికూల ప్రభావాలపై...