సర్ ప్రక్రియపై క్షేత్రస్థాయిలో పర్యటించిన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ప్రణవ్
జమ్మికుంట, జూలై 18 (చైతన్య గళం): బీఎల్ఏలు విధిగా ఓటు సవరణ ప్రక్రియలో పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ నేతలు సూచించారు. కరీంనగర్ మాజీ సుడా ఛైర్మన్, హుజురాబాద్ సర్ ఇంచార్జి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి వొడితల ప్రణవ్ శనివారం జమ్మికుంట మండల పరిధిలోని వావిలాల, సైదాబాద్ గ్రామాల్లో సర్ కార్యక్రమంపై క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు ఓటర్లతో ముచ్చటించి, ఓటు నమోదు ప్రక్రియలో ఏవైనా సమస్యలు ఎదురవుతున్నాయా అని ప్రశ్నించారు. సమస్యలు తలెత్తినప్పుడు సంబంధిత బీఎల్ఏ లేదా...