మంత్రి కోమటిరెడ్డి ఇల్లు ముట్టడించిన ఐకెపి వివోఏలు
నల్లగొండ, జూలై 18 (చైతన్యగళం): తెలంగాణ ఐకెపి వివోఏ ఉద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన 18 వేల వేతన హామీతో పాటు ఇతర వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం ఐకెపి వివోఏల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ ఆఫీసును ముట్టడించారు. ఈ సందర్భంగా ఎండి సలీం మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 18 వేల కనీస...