ఫ్లై ఓవర్ ప్రారంభం కోసం రోడ్డుపై బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
నల్లగొండ, జూలై 18 (చైతన్యగళం): ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఫ్లై ఓవర్‌ను ఆలస్యం చేయకుండా వెంటనే ప్రారంభించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి శనివారం భారీ సంఖ్యలో కార్యకర్తలతో మర్రిగూడ బైపాస్ రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు రోడ్డుపై బైఠాయించిన వారిని అరెస్టు చేసి దేవరకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.దేవరకొండ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రవీంద్ర...