CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 9:46 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఫ్లై ఓవర్ ప్రారంభం కోసం రోడ్డుపై బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

నల్లగొండ, జూలై 18 (చైతన్యగళం):
ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఫ్లై ఓవర్‌ను ఆలస్యం చేయకుండా వెంటనే ప్రారంభించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి శనివారం భారీ సంఖ్యలో కార్యకర్తలతో మర్రిగూడ బైపాస్ రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు రోడ్డుపై బైఠాయించిన వారిని అరెస్టు చేసి దేవరకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.దేవరకొండ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తన అనుచరులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.అరెస్టయిన వారిలో మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, నగర అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, కార్పొరేటర్లు దొడ్డి రమేష్, దీపా నాయక్, గోపగోని స్వాతి రాజశేఖర్, గుండ్రెడ్డి యుగంధర్ రెడ్డి, పెండం ధనుంజయ్, మెండు చంద్రశేఖర్ రెడ్డి, అనిల్ నాయక్, చెనగోని నాగరాజు తదితరులు ఉన్నారు.