ఎండోమెంట్ ధార్మిక సెల్ జిల్లా కన్వీనర్ రాధారెడ్డికి ఘన సన్మానం

వనపర్తి, జూలై 18 (చైతన్యగళం): భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఎండోమెంట్ ధార్మిక సెల్ వనపర్తి జిల్లా కన్వీనర్ చింతలపల్లి రాధారెడ్డికి శనివారం ఘన సన్మానం జరిగింది. పలువురు బీజేపీ నాయకులు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ఆమెను సత్కరించారు. నాయకులు మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర నాయకత్వం రాధారెడ్డిపై ఉంచిన నమ్మకాన్ని ఆమె సమర్థవంతంగా నిలబెట్టుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లాలోని దేవాలయాలు, ధార్మిక సంస్థలు, పుణ్యక్షేత్రాల అభివృద్ధికి ఆమె విశేష కృషి చేస్తారని, ఎండోమెంట్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తారని...