వనపర్తి, జూలై 18 (చైతన్యగళం): భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఎండోమెంట్ ధార్మిక సెల్ వనపర్తి జిల్లా కన్వీనర్ చింతలపల్లి రాధారెడ్డికి శనివారం ఘన సన్మానం జరిగింది. పలువురు బీజేపీ నాయకులు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ఆమెను సత్కరించారు.
నాయకులు మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర నాయకత్వం రాధారెడ్డిపై ఉంచిన నమ్మకాన్ని ఆమె సమర్థవంతంగా నిలబెట్టుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లాలోని దేవాలయాలు, ధార్మిక సంస్థలు, పుణ్యక్షేత్రాల అభివృద్ధికి ఆమె విశేష కృషి చేస్తారని, ఎండోమెంట్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
జిల్లా కన్వీనర్ రాధారెడ్డి మాట్లాడుతూ ఈ గౌరవప్రదమైన బాధ్యతను అప్పగించిన పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నిబద్ధతతో పనిచేస్తూ ధార్మిక రంగ అభివృద్ధికి తన వంతు సేవ అందిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో 7వ వార్డు కౌన్సిలర్ సత్యం సాగర్, న్యాయవాది రాములు యాదవ్, మాజీ కౌన్సిలర్ నవీన్ కుమార్ రెడ్డి, టౌన్ బీజేపీ అధ్యక్షుడు నరేందర్ గౌడ్, కొత్తకోట మండల బీజేపీ కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ భరత్ భూషణ్, రాఘవేందర్ గౌడ్, రాజారాం, అమరేందర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, కవితతో పాటు కొత్తకోట మండల బీజేపీ నాయకులు పాల్గొన్నారు.