ఘనంగా మండేలా, అందెశ్రీ జయంతి వేడుకలు
వనపర్తి, జూలై 18 (చైతన్యగళం): మహనీయుల స్ఫూర్తి వేదిక ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో శనివారం నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నెల్సన్ మండేలా 108వ జయంతి, ప్రజాకవి–లోకకవి డాక్టర్ అందెశ్రీ 65వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహనీయుల స్ఫూర్తి వేదిక రాష్ట్ర చైర్మన్, ప్రజావాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్ మాట్లాడుతూ మండేలా జాతి వివక్ష నిర్మూలన కోసం చేసిన పోరాటం ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని, డాక్టర్ అందెశ్రీ తెలంగాణ ఉద్యమానికి తన సాహిత్యంతో విశేష సేవలందించారని అన్నారు. మహనీయుల స్ఫూర్తితో...