నకిలీ లోన్ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండండి: మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్

మహబూబాబాద్,జూలై 18(చైతన్యగళం): తక్షణ రుణాల పేరుతో ప్రజలను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు నకిలీ లోన్ యాప్‌లు, వెబ్‌సైట్లు, వాట్సాప్ సందేశాల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా కాపాడుకోవాలని సూచించారు. ఇటీవల పీఎం ముద్ర లోన్, ఇండియాబుల్స్ లోన్, హెల్త్ ఇన్సూరెన్స్ లోన్, స్టడీ సర్జరీ లోన్ వంటి పేర్లతో నకిలీ యాప్‌లు, వెబ్‌సైట్లు సృష్టించి, తక్కువ వడ్డీకి వెంటనే రుణం మంజూరు చేస్తామని...