CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 2:21 pm Posted by : CHAITHANYA GALAM NEWS

మర్రిగూడలో సీసీ కెమెరాలపై అవగాహన

మర్రిగూడ, జూలై 18 (చైతన్యగళం):
మర్రిగూడ బస్టాండ్ ఆవరణలోని దుకాణదారులు, గ్రామస్థులకు సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు ఎస్ఐ బి. రాంబాబు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానం. ప్రతి దుకాణం ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి” అని సూచించారు. రాత్రి వేళల్లో ప్రధాన కూడళ్లలో పోలీసులు గస్తీ కొనసాగిస్తున్నారని, ప్రజలు కూడా భద్రతా చర్యల్లో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్స్ సందీప్, అశోక్ పాల్గొన్నారు.