తెలంగాణలో అల్లైడ్ & హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి
కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి తెలంగాణ ఫిజియోథెరపిస్టుల వినతి హైదరాబాద్, జూలై 18 (చైతన్యగళం): తెలంగాణలో అల్లైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ఫిజియోథెరపిస్టుల యూనియన్ ప్రతినిధులు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని శనివారం హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫిజియోథెరపిస్టుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డా. కందుల నాగరాజు మాట్లాడుతూ... రాష్ట్రంలో ఫిజియోథెరపిస్టులకు తగిన ప్రాధాన్యం లభించడం లేదని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫిజియోథెరపిస్టుల పోస్టులు పెద్ద...