స్పెషల్ లోక్ అదాలత్‌లో 46 చెక్‌బౌన్స్ కేసుల పరిష్కారం

సిద్దిపేట, జూలై 18 (చైతన్యగళం): పెండింగ్‌లో ఉన్న చెక్‌బౌన్స్ (ఎన్‌ఐ యాక్ట్) కేసులను త్వరితగతిన పరిష్కరించే లక్ష్యంతో శనివారం సిద్దిపేట జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి. సుదర్శన్ సూచనల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఐ–అదనపు జిల్లా న్యాయమూర్తి వై. జయప్రసాద్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార...