గంజాయి సేవించిన ఇద్దరు యువకులు – డీ-అడిక్షన్ కేంద్రానికి తరలింపు

కరీంనగర్, జూలై 17 (చైతన్యగళం): కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులు సాధారణ గస్తీ నిర్వహిస్తున్న సమయంలో హౌసింగ్ బోర్డు కాలనీలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు యువకులను గుర్తించి విచారించారు. వారి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో చట్టపరమైన విధానాన్ని అనుసరించి పరీక్షలు నిర్వహించగా, వారు ఇటీవల గంజాయి సేవించినట్లు నిర్ధారణ అయింది. విచారణలో గొనే చక్రి రెడ్డి (20, మారుతీనగర్, కరీంనగర్) మరియు షేక్ తాజ్ బాబా (19, షాషామహల్, కరీంనగర్) గంజాయి సేవించే అలవాటు ఉన్నట్లు వెల్లడించారు. గతంలో గోవా వెళ్లిన సమయంలో గుర్తు...