రాములపల్లిలో ఘనంగా స్టీల్ బ్యాంక్ తొలి వార్షికోత్సవం
హుస్నాబాద్, జూలై 17 (చైతన్యగళం): ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో, పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్టు సహకారంతో ప్రారంభించిన స్టీల్ బ్యాంక్ కార్యక్రమం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రాములపల్లి గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంక్ తొలి వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, స్టీల్ బ్యాంక్ ద్వారా గ్రామంలో ప్లాస్టిక్ వినియోగం గణనీయంగా తగ్గి, పర్యావరణ...