CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 9:31 pm Posted by : rakeshkashaveni12@gmail.com

రాములపల్లిలో ఘనంగా స్టీల్ బ్యాంక్ తొలి వార్షికోత్సవం

హుస్నాబాద్, జూలై 17 (చైతన్యగళం):
ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో, పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్టు సహకారంతో ప్రారంభించిన స్టీల్ బ్యాంక్ కార్యక్రమం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రాములపల్లి గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంక్ తొలి వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మహిళా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, స్టీల్ బ్యాంక్ ద్వారా గ్రామంలో ప్లాస్టిక్ వినియోగం గణనీయంగా తగ్గి, పర్యావరణ పరిరక్షణకు ఎంతో మేలు జరుగుతోందన్నారు. గ్రామ ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించి విజయవంతంగా కొనసాగిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్, పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్టుకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాటం స్వప్న, ఉపసర్పంచ్ భాషాబతిని మధు, ఫీల్డ్ అసిస్టెంట్ భాషవేని సదానందం, సీఏ రెడ్డివేణి, స్వప్న, వివో జనవేణి, రాజేశ్వరి, కోశాధికారి చిలుకల కావ్యతో పాటు మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.