స్టీల్ బ్యాంక్ విజయవంతంగా ఏడాది పూర్తి
రేగొండలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన మహిళా సంఘాలు హుస్నాబాద్, జూలై 17 (చైతన్యగళం): రేగొండలో గ్రామం లో ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో, పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్టు సహకారంతో ప్రారంభించిన స్టీల్ బ్యాంక్ కార్యక్రమం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అక్కన్నపేట మండలం రేగొండ గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంక్ తొలి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మహిళా సంఘాల...