నూతన గోదాము నిర్మాణానికి భూమిని కేటాయించాలిని కలెక్టర్‌కు వినతిపత్రం

కరీంనగర్, జూలై 17 (చైతన్యగళం): రైతులకు మెరుగైన మార్కెట్ సౌకర్యాలు కల్పించేందుకు నూతన గోదాములు, షెడ్ల నిర్మాణం కోసం వ్యవసాయ మార్కెట్ కమిటీకి ప్రభుత్వ భూమిని కేటాయించాలని కోరుతూ కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు శుక్రవారం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాను ఆమె ఛాంబర్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ, కాటన్ మార్కెట్ యార్డు, గ్రెయిన్స్ మార్కెట్ యార్డు, ఫ్రూట్ మార్కెట్ యార్డుల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్థలం...