స్టీల్ బ్యాంక్‌తో ప్లాస్టిక్ రహిత హుస్నాబాద్‌కు ఏడాది
276 మహిళా సంఘాల భాగస్వామ్యంతో పర్యావరణ పరిరక్షణలో వినూత్న ఉద్యమం హుస్నాబాద్, జూలై 17 (చైతన్యగళం): ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రజలను భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో ప్రారంభించిన "స్టీల్ బ్యాంక్"కార్యక్రమం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో, పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్టు స్వంత నిధులతో ప్రారంభమైన ఈ కార్యక్రమం నేడు హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రజా ఉద్యమంగా మారిందని మంత్రి తెలిపారు. గత ఏడాది జూలై 17న తెలంగాణ గవర్నర్...