నల్గొండలో రాత్రి గస్తీ నిఘా పటిష్టం
నల్గొండ, జూలై 17 (చైతన్యగళం): జిల్లా పోలీసు శాఖ రాత్రి నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసింది. నైట్ బీట్ సిబ్బందికి రిఫ్లెక్టివ్ జాకెట్లు, ఎల్ఈడీ లాఠీలు, ఫైబర్ లాఠీలు అందజేసి, రాత్రి గస్తీని సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు.జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ఈ భద్రతా పరికరాలను పంపిణీ చేస్తూ, “దొంగతనాలు, గొలుసు దొంగతనాలు, వాహనాల దొంగతనాలు, ఇతర నేరాలను నివారించడానికి రాత్రి గస్తీని ముమ్మరం చేయాలి. ప్రమాదకర ప్రాంతాలు, నివాస కాలనీలు, హైవేలు, ఏటీఎంలు, బ్యాంకులు, నగల దుకాణాలు...