మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ జరిగిన రెండో టీ20లో పర్యాటక జింబాబ్వేపై 34 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది.
రెండో టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఓపెనర్లు సైఫ్ హస్సన్ (55), తంజిద్ హసన్ తమీమ్ (58) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆఖర్లో యాసిర్ అలీ (22 నాటౌట్), సైఫుద్దీన్ (31 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. జింబాబ్వే బౌలర్లలో నగరవ, ఈవాన్స్ చెరో 2 వికెట్లు సాధించారు. అలానే స్టార్ ఆల్‌రౌండర్ సికందర్ రజా ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం ఓ 187 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే.. 19.4 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌటైంది.
బంగ్లా బౌలర్లు రిషద్ హొస్సేన్ (4-26), మెహిది హసన్ (3-24) ధాటి జింబాబ్వే బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. నహిద్ రాణా, సైఫుద్దీన్ , సైఫ్ హస్సన్ తలో వికెట్ తీశారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. సికందర్ రజా (28), బ్రాడ్ ఈవాన్స్ (25), ర్యాన్ బర్ల్ (29) లు మాత్రమే కాస్త ఫర్వాలేదనిపించారు. ఈ విజయంతో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. నిర్ణయాత్మక మూడో టీ20 జులై 19న(ఆదివారం) జరుగనుంది. కాగా, ఈ సిరీస్‌కు ముందు జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో, ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు జింబాబ్వే షాకిచ్చింది. వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మూడో టీ20 గెలిచి.. ఈ సిరీస్‌ను కూడా కైవసం చేసుకోవాలనే కసితో జింబాబ్వే ఉంది.