దేవరకొండలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు
దేవరకొండ,జూలై 17(చైతన్యగళం): దేవరకొండలో సంచలనం సృష్టించిన బస్టాండ్ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని బ్లేడ్లతో బ్యాగులు, కవర్లు కోసి నగదు దోచుకునే అంతర్రాష్ట్ర దొంగల ముఠాను దేవరకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.ఈ నెల ఒకటో తేదీన దేవరకొండ కొత్త బస్టాండ్‌లో మండల లక్ష్మమ్మ అనే మహిళ చేతిలో ఉన్న కవర్‌ను బ్లేడుతో కట్ చేసి రూ.2 లక్షల నగదును దుండగులు అపహరించారు....