సీనియర్ సిటిజన్లకు ఉచిత వైద్య శిబిరం
35 మంది వృద్ధులకు ఆరోగ్య పరీక్షలు, ఉచిత మందుల పంపిణీ కరీంనగర్, జూలై 17 (చైతన్య గళం): రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో ఉన్న ప్రణామం డే కేర్ సెంటర్‌లో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ ప్రత్యూష సీనియర్ సిటిజన్లకు ఉచితంగా రక్తంలో చక్కెర (షుగర్), రక్తపోటు (బీపీ) పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేశారు. ఈ శిబిరంలో సుమారు 35...