CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 7:52 am Posted by : CHAITHANYA GALAM NEWS

రైతు పొలాలకు నిరంతర విద్యుత్ – వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల, జూలై 16 (చైతన్య గళం):
వేములవాడ నియోజకవర్గ పరిధిలోని రుద్రంగి విద్యుత్ సబ్‌స్టేషన్‌లో నూతన 8 ఎంవిఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “లో-వోల్టేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. రైతులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడమే మా లక్ష్యం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటోంది. గత రెండున్నరేళ్లలోనే వేములవాడ నియోజకవర్గానికి 13 కొత్త సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేశాం. రైతులకు కిలోమీటర్ వరకు ఉచిత విద్యుత్ లైన్, అవసరమైన ట్రాన్స్‌ఫార్మర్లు అందిస్తున్నాం” అని తెలిపారు.

ఆయన స్పష్టం చేస్తూ, “అభివృద్ధే మా ధ్యేయం. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం” అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.