సెప్టెంబర్‌లోపు తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి: కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్, జూలై 17 (చైతన్యగళం): ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో కరీంనగర్ జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. తొలి విడత కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాలను సెప్టెంబర్‌లోపు యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, పెద్ద ఎత్తున గృహప్రవేశాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే రెండో విడతలో నిజమైన అర్హులైన పేదలకు ప్రాధాన్యం కల్పించి ఇళ్ల మంజూరుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, గృహ నిర్మాణ శాఖ అధికారులతో...