ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం
రంగారెడ్డి, జూలై 17 (చైతన్యగళం): ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శివరాంపల్లి కాన్ఫరెన్స్ హాల్‌లో అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్ మయి హాజరై, జనాభా మార్పులు, కుటుంబ సంక్షేమం, మహిళల ఆరోగ్యం, తల్లి‑శిశు సంరక్షణ వంటి అంశాలపై ప్రతి కుటుంబానికి అవగాహన కల్పించడం అత్యంత అవసరమని సూచించారు. “అనవసర గర్భధారణలను నివారించడం, ప్రసవాల మధ్య తగిన విరామం పాటించడం ద్వారా తల్లి‑శిశువు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆరోగ్యవంతమైన...