ప్రభుత్వ పాఠశాలలకు ప్రత్యేక గుర్తింపు లక్ష్యం

కరీంనగర్, జూలై 17 (చైతన్యగళం): జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్ది, కరీంనగర్ జిల్లాకు విద్యారంగంలో రాష్ట్రస్థాయి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్‌లో విద్యాశాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎంఈఓలు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాళ్లు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు, కోఆర్డినేటర్లతో కలెక్టర్ మాట్లాడారు. “ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూల్స్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో విద్యార్థుల నమోదు గణనీయంగా పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి” అని సూచించారు. విద్యకు రాష్ట్ర ప్రభుత్వం...