మహిళా సంఘాలపై సర్పంచ్ పెత్తనం ఎందుకు? – ఉపసర్పంచ్ సింగరయ్య
హుస్నాబాద్ , జూలై 16 (చైతన్యగళం): సిద్దిపేట జిల్లా కోహెడ మండలం సముద్రాల గ్రామంలో మహిళా సంఘాల వ్యవహారాల్లో గ్రామ సర్పంచ్ అట్ల శ్రీనివాస్ అనవసర జోక్యం చేసుకుంటూ సంఘాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని గ్రామ ఉపసర్పంచ్ చింతకింది సింగరయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. బుధవారం ఐకేపీ కార్యాలయంలో జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ, మహిళా సీఏ పట్ల సర్పంచ్ వ్యవహరించిన తీరు అభ్యంతరకరమని ఆయన విమర్శించారు. “మహిళా సంఘాల స్వతంత్రతను దెబ్బతీసే విధంగా బెదిరింపులకు దిగడం, అధికార దుర్వినియోగానికి పాల్పడడం సరికాదు. మహిళా సంఘాల...