పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థపనలు చేసిన కేంద్రమంత్రి బండి సంజయ్
కరీంనగర్, జూలై 16 (చైతన్యగళం): కరీంనగర్ నగర సమగ్ర అభివృద్ధిలో భాగంగా 36వ డివిజన్ మారుతి నగర్‌లో రూ.60 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, 36వ డివిజన్ కార్పొరేటర్ తోట అనిల్తో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. శంకుస్థాపన అనంతరం మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, “కరీంనగర్ నగరాన్ని అన్ని...