CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 8:01 pm Posted by : CHAITHANYA GALAM NEWS

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థపనలు చేసిన కేంద్రమంత్రి బండి సంజయ్

కరీంనగర్, జూలై 16 (చైతన్యగళం): కరీంనగర్ నగర సమగ్ర అభివృద్ధిలో భాగంగా 36వ డివిజన్ మారుతి నగర్‌లో రూ.60 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గురువారం శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, 36వ డివిజన్ కార్పొరేటర్ తోట అనిల్తో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

శంకుస్థాపన అనంతరం మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, “కరీంనగర్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే మా లక్ష్యం. ప్రతి డివిజన్‌లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నాం” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దేవసాని సరస్వతి, బండ రమణారెడ్డి, టింకు సోమిడి వేణు ప్రసాద్, మాసం గణేష్, జి.వి. రమణలతో పాటు బూత్ అధ్యక్షులు దర్శనాల కృష్ణ, తిరుమణి కరుణాకర్, కొంపెల్లి సాగర్, కమటం చందు, రాధారపు శ్రీకాంత్, మెతుకు రజనీకాంత్, వివేక్ క్రాంతి పాల్గొన్నారు.

డివిజన్ కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో హాజరై ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.