తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు 

అమృత్ పనులు వేగవంతం చేయాలి వర్షపు నీటి సంరక్షణపై దృష్టి  సీజనల్ వ్యాధుల నివారణకు ప్రతి శుక్రవారం డ్రైడే సూపర్ ఎల్‌నినో నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి కరీంనగర్, జూలై 16 (చైతన్యగళం): రాష్ట్రంలో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా అత్యంత ప్రాధాన్యతతో చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. తాగునీటి సరఫరా, సీజనల్ వ్యాధుల నియంత్రణ, విద్యాశాఖ కార్యక్రమాలు, సూపర్ ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై గురువారం హైదరాబాద్ నుంచి జిల్లా...