ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, భద్రతపై రాజీ లేదు – ఎంపీ మల్లు రవి
తెలకపల్లి, జూలై 16 (చైతన్యగళం): నాగర్‌కర్నూల్ కలెక్టర్ కార్యాలయంలో గురువారం జరిగిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎంపీ డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ, “ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, భద్రత, సామాజిక న్యాయం విషయంలో ప్రభుత్వం రాజీ పడదు. బాధితులకు సత్వర న్యాయం, నష్టపరిహారం అందించడంలో జిల్లా యంత్రాంగం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి” అని స్పష్టం చేశారు. ఆయన పేర్కొంటూ, “ఎస్సీ, ఎస్టీలపై జరిగే దాడులు, హత్యలు, అత్యాచారాలు, వివక్ష ఘటనల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం సహించబోము. ప్రతి కేసును అత్యంత...