ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి తూట్లు పొడుస్తున్న కాంగ్రెస్ సర్కార్ – ప్రవీణ్ కుమార్

హైదరాబాద్, జూలై 16 (చైతన్యగళం): బీజేవైఎం పూర్వ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, “పేద, బడుగు, బలహీన వర్గాలకు ఉన్నత విద్యను అందించాలనే సదుద్దేశంతో 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వేలాది విద్యార్థులకు వరంగా మారింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని నీరుగారుస్తూ విద్యార్థుల భవిష్యత్తును చీకట్లోకి నెడుతోంది” అని తీవ్రంగా విమర్శించారు. ఆయన పేర్కొంటూ, “తెలంగాణలో దాదాపు 90 శాతం మంది విద్యార్థులు ఈ పథకంపై ఆధారపడి చదువుకుంటున్నారు. గత నాలుగైదు సంవత్సరాలుగా రూ.10,000 కోట్ల...