రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమం
నంద్యాల, జూలై 16 (చైతన్యగళం): జిల్లా వ్యాప్తంగా నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా "స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో" కార్యక్రమాన్ని పోలీసులు అమలు చేస్తున్నారు.జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు అధికారులు రాత్రి వేళల్లో గస్తీ, విజిబుల్ పోలిసింగ్ నిర్వహిస్తూ ప్రధాన రహదారులపై వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై తనిఖీలు జరిపి, లాడ్జిల్లో ఆకస్మిక తనిఖీలు చేసి భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రజల భద్రతను...