CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 9:46 pm Posted by : CHAITHANYA GALAM NEWS

రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమం

నంద్యాల, జూలై 16 (చైతన్యగళం): జిల్లా వ్యాప్తంగా నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా “స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమాన్ని పోలీసులు అమలు చేస్తున్నారు.జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు అధికారులు రాత్రి వేళల్లో గస్తీ, విజిబుల్ పోలిసింగ్ నిర్వహిస్తూ ప్రధాన రహదారులపై వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై తనిఖీలు జరిపి, లాడ్జిల్లో ఆకస్మిక తనిఖీలు చేసి భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని రాత్రి పూట ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. రహదారి ప్రమాదాల నివారణకు డ్రైవర్లకు అవగాహన కల్పిస్తూ “స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.ప్రజలు అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు గమనించిన వెంటనే డయల్ 100/112కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.