CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 4:37 pm Posted by : CHAITHANYA GALAM NEWS

నిరుపేద కుటుంబానికి అండగా సర్పంచ్ ముచ్చర్ల సుగుణ సంపత్

యాచారం,జులై 16(చైతన్యగళం) : గత కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో చనిపోయిన మేడిపల్లి గ్రామ వాసి “నాగిల్ల మైసయ్య” దశదిన కర్మ సందర్భంగా గ్రామ “సర్పంచ్ ముచ్చర్ల సుగుణ సంపత్” మైసయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఆతర్వాత మైసయ్య సతీమణి రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, మనోధైర్యాన్ని నింపి… దశదినకర్మ కార్యక్రమానికి 7 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దెంది మధుకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నల్లోళ్ల గణేష్ , నల్లోల్ల చంద్రయ్య ,కొంగల్ల చెన్నైయ్య, మంద శ్రీను,మొరుగు మహేష్ నర్సింహా, యాదయ్య, జగన్ లు పాల్గొన్నారు.