CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 6:05 pm Posted by : CHAITHANYA GALAM NEWS

అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం ఎమ్మెల్యేకు వినతి

దేవరకొండ,జూలై 16(చైతన్యగళం): మునగాల కొండల్ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వ), దేవరకొండలో గత మూడు సంవత్సరాల నుండి పెరుగుతున్న విద్యార్థుల ప్రవేశాలకు అనుగుణంగా అదనపు తరగతి గదుల నిర్మాణం కొరకు మరియు అసంపూర్తిగా ఉన్నా కళాశాల మైదానం ప్రహరీ గోడ నిర్మాణాన్ని పూర్తి చేయుటకు తగిన చర్యలు తీసుకోవాలని దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ కి అధ్యాపక బృందం వినతి పత్రాన్ని అందజేశారు ఈ విషయం పైన ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామావత్ రవి మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు.